Saturday, 29 September 2012

మంచి సూక్తులు

0 comments
ఈ సృష్టిలో మనకిలానె ప్రతి జీవికి బ్రతికె హక్కు ఉంది..
ప్రకృతిలో ఏదొ ఒక జాతి మాత్రమే ఆదిపత్యం కొనసాగిస్తుంటే..
ప్రకృతి మాత చూస్తూ ఊరుకోదు తన పని మొదలుపెడుతుంది..
ఫ్రళయం సృష్టిస్తుంది ఉపద్రవాలు ఉవ్వెత్తున్న ఎగిసిపడతాయ్..
ఆ ఆదిపత్యం చెసె జాతి మొత్తాన్ని తుడిచిపెట్టెస్తుంది..

                                                                            శ్రీనివాసు పెమ్మా



రహస్యం ఆయుధంలాంటిది మన గుప్పిట్లొ ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటాం. ఇతరుల చేతిలొ పడింద సంక్షోభమే.

మన బలాల్ని రహస్యంగా ఉంచుకోవాలి. మన బలహీనతలని ఇంక రహస్యంగా ఉంచుకోవాలి ఈ విషయంలో తాబెలు మనకు ఆదర్శం. పైపొర చాతున తన పాదలని ఎంత జాగ్రత్తగా దాచుకుంటుంది

చేయి విషతుల్యమైతె చేయినీ తీసెయ్యాలి. కాలు విషతుల్యమైతె కాలినీ తీసెయ్యాలి. ఆలస్యం చెస్తే.. విషం నిలువెల్ల వ్యాపిస్తుంది. అవినీతిపరులు నమ్మకద్రోహూలూ కాలకూట విషం కంటే ప్రమాదం.

రాజధాని గుండెకాయ వంటిది. శత్రు గూడచారుల ప్రాభల్యం అక్కడ విస్తరించిందంటే.. అది నాయకుడి వైఫల్యం, మొత్తం పాలన వ్యవస్థ వైఫల్యం.

చిల్లుల పాత్రలో నీరు నిలవడం ఎంత అసాధ్యమో.. చంచల స్వభావుల నొట్లో రహస్యాలు దాగదమూ అంతే అసాధ్యం. అలాంటి వ్యక్తులకు కీలక సమాచారం తెలియనివ్వకూడదు

                                                                               చాణక్య నీతి 

Leave a Reply